చిత్తూరు జిల్లాకు కోయంబేడు మార్కెట్ సెగ
చెన్నై కోయంబేడు మార్కెట్లో అధిక సంఖ్యలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల ప్రభావం చిత్తూరు జిల్లాపై తీవ్రంగా పడింది. తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దు జిల్లాగా ఉన్న చిత్తూరు నుంచి రైతులు... కోయంబేడు మార్కెట్‌కు ఎక్కువగా పండ్లు, కూరగాయలను రవాణా చేయటమే ఇప్పుడు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. నిన్నటి వరకూ జిల్లాలో కేసుల ప్రభావం తగ్గుముఖం పట్టగా... ఇప్పుడు ఒక్కసారిగా 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 10 కేసులు కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్నవి కావటం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఈ అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
చిత్తూరు జిల్లాకు కోయంబేడు మార్కెట్ సెగ
ఇదీ చూడండి: జిల్లాలో మరో 11 పాజిటివ్ కేసులు