చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో కరోనా బాధితులకు ప్రభుత్వం సూచించిన మోనూ ప్రకారం భోజనం అందడం లేదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 లోపు భోజనం పెట్టాలని మెనూలో ఉంటే... సంబంధిత కాంట్రాక్టర్లు మధ్యాహ్నం ఒకటిన్నరకు భోజనం వడ్డిస్తున్నారు.
మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో 120 మంది వరకు కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరికి భోజనం కోసం ప్రభుత్వం రోజుకు ఒక్కొక్కరికీ రూ.300 కేటాయించింది. అయితే ఆస్పత్రిలో భోజనం పరిమాణం తగ్గించి, చాలీచాలని ఆహారం అందిస్తున్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ సుబ్బారావు... సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:
కరోనాతో సచివాలయ కార్యదర్శి మృతి.. తరలింపునకూ రాని అంబులెన్స్!