ETV Bharat / state

600 ఏళ్లలో తొలిసారిగా జాతర నిర్వహించట్లేదు!

రాయలసీమ లోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన తిరుపతి గంగమ్మ జాతరను 600ఏళ్లలో తొలిసారిగా నిర్వహించట్లేదని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. కరోనా ప్రభావమే ఇందుకు కారణమని చెప్పారు.

corona effect on gangamma jatara  at thirupati
తిరుపతిలో గంగమ్మ జాతర
author img

By

Published : May 12, 2020, 1:23 PM IST

తిరుమల శ్రీవారి తోబుట్టువుగా..... తిరుపతి గ్రామ దేవతగా పేరుగాంచి తిరుపతి గంగమ్మ జాతర.. కరోనా మహమ్మారి కారణంగా ఆలయానికే పరిమితమైంది. రాయలసీమలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన తిరుపతి గంగమ్మ జాతరను మే నెల మొదటి, రెండు వారాల్లో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేవారు. ఈ తొమ్మిది రోజులు భక్తులంతా రోజుకో వేషధారణలో అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకునేవారు.

పాలెగాళ్ల అరాచకాల నుంచి ప్రజలను కాపాడిన దేవతగా కొలిచే గంగమ్మ తల్లిని జాతర సమయంలో దర్శించుకునేందుకు... కేవలం చిత్తూరు జిల్లా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చేవారు. కరోనా మహమ్మారి కారణంగా జాతర వైభవాన్ని తొలిసారిగా తిరునగరి చూడలేకపోయింది. అమ్మవారి జన్మదినం రోజున... చరిత్రలో మొదటి సారి ఆలయం భక్తులు లేరు.

సమ్మక్క, సారలమ్మ మేడారం జాతర తర్వాత అంతటి ప్రసిద్ధి గాంచిన తిరుపతి గంగమ్మ జాతర ఈసారి జరగకపోవటం బాధాకరమని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత వైభవంగా అమ్మవారికి జాతర జరిపించేలా సమాలోచనలు చేస్తున్నామన్నారు. అప్పటివరకూ కేవలం గర్భాలయంలో మాత్రమే పూజలను చేయిస్తామన్నారు. 6 శతాబ్దాల చరితర ఉన్న ఈ జాతర.. కరోనా కారణంగా నిర్వహించలేకపోతున్నామని అన్నారు.

ఇదీ చూడండి:

భారీగా పడిపోయిన తిరుమలేశుడి ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.