ETV Bharat / state

డ్రైవర్‌ అన్నా జర చూసి నడుపు - ఆర్టీసీ బస్సులపై ట్రాఫిక్‌ చలానాలు ఎన్నో తెలుసా? - TRAFFIC CHALLANS ON TGSRTC BUSES

హైదరాబాద్​లో ఆర్టీసీ బస్సులపై 5798 ట్రాఫిక్‌ చలానాలు

Traffic Challans on TGSRTC Buses
Traffic Challans on TGSRTC Buses (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2024, 9:22 AM IST

Traffic Challans on TGSRTC Buses : హైదరాబాద్​లో కొందరి ర్యాష్‌ డ్రైవింగ్‌ ఆర్టీసీ ప్రతిష్ఠను మసకబారుస్తోంది. ఇష్టానుసారం ఓవర్‌ టేక్‌లు, మితిమీరిన వేగం, నడి రోడ్డుపై బస్సును నిలిపేయడం వంటి చర్యలతో వెనక వచ్చే వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ఆర్టీసీ బస్సులపై 5798 ట్రాఫిక్‌ చలానాలున్నాయంటే పరిస్థితి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదంటూ కొందరు వాహనదారులు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. అయినా 1 శాతంలోపే ప్రమాదాలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులు ప్రకటించడం గమనార్హం.

ఏడాదిలో ప్రమాదాలిలా :

  • సెప్టెంబర్‌ 15న కొత్తగూడ చౌరస్తా నుంచి మాధవి అనే మహిళ నడుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో రోడ్డు దాటుతుడంగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
  • నవంబర్‌ 2న తార్నాక నుంచి హబ్సిగూడ వెళ్లే దారిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మరణించింది.
  • జులై 11న హిమాయత్‌ నగర్‌కు చెందిన స్రవంతిరాణి ఆసిఫ్‌నగర్‌ నుంచి హిమాయత్‌నగర్‌కు ద్విచక్ర వాహనంపై వస్తుంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో యువతి మృతిచెందింది.

గుడ్​న్యూస్ - ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం!

​ఆర్టీసీ శుభవార్త : అదనపు ఛార్జీల్లేకుండానే 'సంక్రాంతి' స్పెషల్​ బస్సులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.