ETV Bharat / state

'చిత్తూరు జిల్లాలోని మూడు ప్రాంతాల్లో కరోనా డ్రై రన్'

చిత్తూరు జిల్లాలోని మూడు ప్రాంతాల్లో శనివారం కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎన్‌.భరత్‌ గుప్తా తెలిపారు. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం, తిరుపతి స్విమ్స్, మదనపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో డ్రై రన్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు.

చిత్తూరు జిల్లాలోని మూడు ప్రాంతాల్లో కరోనా డ్రై రన్

author img

By

Published : Jan 1, 2021, 9:55 PM IST

చిత్తూరు జిల్లాలోని మూడు ప్రాంతాల్లో శనివారం కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎన్‌.భరత్‌ గుప్తా తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్​పై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన..డ్రై రన్ నిర్వహించడానికి జిల్లాలోని మూడు డివిజనల్లలో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం, తిరుపతి స్విమ్స్​తో పాటు మదనపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో డ్రై రన్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. ఇంఛార్జ్ అధికారితో పాటు ఐదుగురు అధికారులు డ్రై రన్‌ పర్యవేక్షించాలన్నారు.

మొదటి విడత జిల్లాలోని 31,296 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బందికి మాత్రమే టీకా ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వనున్న ఆరోగ్య సిబ్బంది వివరాలు, వారికి వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రాంతాలు, సమయంతో కూడిన పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ఏరియా, కమ్యునిటీ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులు మొదటి విడత కొవిడ్ వ్యాక్సినేషన్‌లో పాల్గొనేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఇదీచదవండి

కోసిగిలో 10 మందికి అస్వస్థత.. నీరే కారణమా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.