ETV Bharat / state

తితిదే కమిటీదే విజయమని న్యాయ నిర్ణేత చెప్పారు : పండిత పరిషత్ కమిటీ - రామ భక్త హనుమాన్ జన్మస్థలంపై వివాదం

రామ భక్త హనుమాన్ జన్మస్థలంపై వివాదం రేగింది. అంజనీపుత్రుడు జన్మించింది తిరుగిరుల్లోని అంజనాద్రేనని శ్రీ రామనవమి రోజు తితిదే పండిత పరిషత్ చేసిన ప్రకటనకు ప్రతిగా.. సంవాదానికి దిగిన హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ గోవిదానంద సరస్వతి అసంపూర్తిగా చర్చను ముగించారు. ఈ నేపథ్యంలో గోవిందానందపై తితిదే పండిత కమిటీ తీవ్రస్థాయిలో మండిపడింది. పురాణాలపై పట్టులేని, సంస్కృతం తెలియని గోవిందానంద వితండవాదానికి దిగుతున్నారే కానీ.. కిష్కంధనే ఆంజనేయుడి జన్మస్థలం అని నిరూపించడానికి ఆధారాలతో చూపించలేకపోయారని పండిత పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతకుముందే తితిదే పండిత కమిటీకి అసలు ప్రామాణికతే లేదని గోవిందానంద ఘాటు విమర్శలు చేశారు. ఫలితంగా రోజంతా మారుతి జన్మస్థలంపై వాదోపవాదాలు కొనసాగాయి.

సర్వత్రా చర్చనీయాంశం : అంజనీపుత్రుడి జన్మ స్థలంపై సంవాదం అసంపూర్తి

author img

By

Published : May 28, 2021, 4:38 AM IST

Updated : May 28, 2021, 3:38 PM IST

హనుమంతుడి జన్మ స్థలంగా తిరుమల కొండల్లోని అంజనాద్రిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటిస్తూ నియమించిన పండిత పరిషత్ శ్రీరామనవమి రోజున చేసిన ప్రకటన.. అనంతర పరిణామాలు వేడిని రాజుకుంటున్నాయి. ఆంజనేయుడిని తమ వాడిగా ప్రకటించిన తితిదే పండిత కమిటీ తీరును నిరసిస్తూ.. తిరుమల పర్యటనలో భాగంగా తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ గోవిందానంద సరస్వతి సంవాదానికి దిగారు.

మహామహుల మధ్య 4 గంటల సంవాదం..

తితిదే కమిటీ నుంచి ఛైర్మన్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధరశర్మ, ఎస్వీవేద అధ్యయన సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వీసీ సన్నిధానం సుదర్శన శర్మ తదితరులు పాల్గొన్నారు. పంపాక్షేత్ర కిష్కింధ తరపున హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ గోవిందానంద సరస్వతి ఒక్కరే పాల్గొనగా.. దాదాపు నాలుగు గంటల పాటు సంవాదం జరిగింది.

తితిదే కమిటీపై ఆగ్రహం..

ఇరు వర్గాలు తమ వద్దనున్న విషయాలపై చర్చ నిర్వహించాయి. అంజనాద్రి తిరుమల కొండల్లోనిదేనని తితిదే పండిత కమిటీ వివరించగా.. కిష్కింధనే మారుతి జన్మస్థలమని గోవిందానంద సరస్వతి విబేధించారు. చివరికి అంసపూర్తిగా చర్చ ముగియగా తితిదే పండిత కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కిష్కింధ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ గోవిందానంద సరస్వతి మాత్రం తితిదే కమిటీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.

ప్రామాణికత ఏదీ : గోవిందానంద

అసలు తితిదే నియమించిన పండిత కమిటీకి ప్రామాణికత ఏంటని ప్రశ్నించిన గోవిందానంద సరస్వతి.. తిరుపతి పెద్ద జీయర్ అనుమతి, అంగీకారం హనుమంతుడి ప్రకటన వెనుక ఉన్నాయా అని ప్రశ్నించారు. కంచికామకోటి పీఠం, శృంగేరీ శంకరాచార్యులు, మధ్వాచార్యులు, తిరుపతి జీయర్ స్వాములు ఇలా ఇంతమంది ఉండగా.. తిరుమలలోని దైవిక కార్యక్రమానికి సంబంధించిన అంశాన్ని పండిత కమిటీ ఏ అధికారంతో వెల్లడిస్తోందని నిలదీశారు.

రామాయణం ప్రకారం..

వాల్మీకీ రామాయణం ప్రామాణికంగా హనుమంతుడు జన్మించింది కిష్కింధలోనే అని మరోసారి చెబుతున్నామన్న గోవిందానంద సరస్వతి.. తితిదే కమిటీ చెబుతున్న పురాణాల దృష్టాంతాలు అన్నీ వారికి అనుకూలంగా అన్వయించుకుంటున్నారన్నారు. కంచిపీఠం, శృంగేరీ పీఠం, మధ్వాచార్యలు, తిరుపతి జీయర్ స్వాముల వద్దకు ఈ అంశాన్ని స్వయంగా తీసుకువెళ్తామన్న గోవిందానంద సరస్వతి.. వారే ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని కోరుతామన్నారు. బహిరంగ చర్చ అని పిలిచి మీడియాను లోనికి అనుమతివ్వకుండా ఆంతరంగికంగా చర్చ జరపటంలో తితిదే ఆంతర్యం ఏమిటో అర్థం కావటం లేదని గోవిందానంద సరస్వతి ఆక్షేపించారు.

'అవమానించినా.. లోటు రానివ్వలేదు'

తితిదే పండిత కమిటీపై గోవిందానంద సరస్వతి చేసిన వ్యాఖ్యనలు ఖండిస్తూ పండిత పరిషత్ సాయంత్రం ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హనుమత్ జన్మస్థలంపై తితిదే ప్రకటనను విబేధిస్తూ గోవిందానంద రాసిన లేఖలను పండిత పరిషత్ చదివి వినిపించింది. సన్యాసంలో ఉన్న స్వామిజీ వాడే భాష లేఖలో లేదని ధ్వజమెత్తిన కమిటీ.. తితిదేని, ఈవోని అవమానిస్తూ లేఖలు రాసినా.. తిరుమల పర్యటనలో గోవిందానందకి ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నామన్నారు.

ప్రాథమిక స్థాయి పట్టు లేక వితండవాదం..

పురాణాలపైనా, సంస్కృత భాషపైనా ప్రాథమిక స్థాయి పట్టులేని గోవిందానంద.. కేవలం వాల్మీకి రామాయణమే ప్రామాణికమని వితండవాదం చేస్తున్నారని పరిషత్ ఛైర్మన్ ప్రొ.మురళీధరశర్మ సహా సభ్యులు ఆకెళ్ల విభీషణశర్మ, రామకృష్ణ విస్మయం వ్యక్తం చేశారు. చారిత్రక, వాంజ్ఞ్మయ, భౌగోళిక, శాసనపరమైన ఆధారలతో అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని మరో మారు స్పష్టం చేశారు.

వాదనలో తితిదే కమిటీదే విజయం : న్యాయ నిర్ణేత కుప్పా విశ్వనాథ్

వేద పండితుడు, పురాణాలను ఆపోశన పట్టిన కుప్పా విశ్వనాథ్ న్యాయ నిర్ణేతగా చర్చ జరిగిందని తెలిపిన పండిత పరిషత్ సభ్యులు.. వాదనలో తితిదే కమిటీదే విజయమని న్యాయ నిర్ణేత తెలిపారన్నారు. గోవిందానంద.. గతంలో షిరిడీ సాయి విషయంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని విమర్శించిన కమిటీ సభ్యులు.. హంపీ నగరం కిష్కింధ కావొచ్చేమో కానీ.. ఆంజనేయుడి జన్మస్థలం కాదని మరో మారు స్పష్టం చేస్తున్నట్లు వివరించారు.

సొంత అభిప్రాయంగానే పరిగణిస్తాం : హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్

ఆరోపణ, ప్రత్యారోపణలతో అంజనీపుత్రుడి జన్మస్థలం విషయంలో జరిగిన భేటీ సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. తితిదే పండిత కమిటీ నిర్ణయాన్ని సభ్యులు, తితిదే అధికారుల సొంత అభిప్రాయంగానే పరిగణిస్తామని హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పేర్కొంది. ఈ అంశంపై తితిదే పండిత కమిటీ వద్ద అన్ని ఆధారాలు ఉన్నందున గోవిందానంద మరో మారు చర్చ చేయాల్సిన అవసరం లేదని తితిదే పండిత పరిషత్ తేల్చి చెప్పింది. తిరుమలలోని అంజనాద్రి పర్వతమే హనుమాన్ జన్మస్థలంగా తితిదే పండిత పరిషత్ ప్రస్ఫుటంగా చెప్పింది.

ఇవీ చూడండి : TTD-Hanuman birth place: అసంపూర్తిగా ముగిసిన హనుమాన్‌ జన్మస్థలంపై చర్చ

Last Updated : May 28, 2021, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.