పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ముఖ్య సమాచార అధికారిగా పనిచేస్తున్న వ్యక్తిని తితిదే ఉప కార్యనిర్వాహణాధికారిగా నియమించడం చర్యనీయాంశమైంది. మూడు రోజుల కిందట ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు పలు విమర్శలకు దారితీస్తున్నాయి. సాధారణంగా రెవెన్యూ శాఖలో ఆర్డీవో స్థాయి అధికారులను తితిదే డిప్యూటీ ఈవోలుగా నియమిస్తారు. అలాంటిది ముఖ్యసమాచార అధికారికి కీలక బాధ్యతలు అప్పగించటంపై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు.
ఇదీ చదవండి: ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి