ETV Bharat / state

రోడ్డుప్రమాదంలో హెడ్​కానిస్టేబుల్ మృతి - రోడ్డుప్రమాదంలో హెడ్​కానిస్టేబుల్ మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని హెడ్​కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన..చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

రోడ్డుప్రమాదంలో హెడ్​కానిస్టేబుల్ మృతి
రోడ్డుప్రమాదంలో హెడ్​కానిస్టేబుల్ మృతి
author img

By

Published : Jun 1, 2020, 8:45 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. నిన్న అర్ధరాత్రి తొండవాడ బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అతను మృతి చెందాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు...మృతుడు తిరుమల టు టౌన్ పోలీస్ స్టేషన్​లో హెడ్ కానిస్టేబుల్ జయచంద్రగా గుర్తించారు.మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.