చివరి శ్వాస విడిచే వరకూ కాంగ్రెస్తోనే ఉంటా! - కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం.
ఆఖరి శ్వాస విడిచేంత వరకు కాంగ్రెస్ సేవలో ఉంటూ పార్టీ బలోపేతానికి శ్రమిస్తానని చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నర్సింహులు అన్నారు. వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎన్నికల ప్రచారం చేశారు.
కాంగ్రెస్ ప్రచారం
యాంకర్: విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో నాతవరం మండలం లోని పలు గిరిజన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీసాల సుబ్బన్న తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ మేరకు ఆ మండలం లో చమ్మచింత, తాండవ తదితర గ్రామాల్లో పర్యటించి ఇంటింటి ప్రచారం చేశారు. వారపు సంతల్లోనూ, ఇతర వాణిజ్య సముదాయాల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్దించారు. ఈ సారికి తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.OVER