న్యాయవాది అయిన తన సంతకాన్నే ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడమే కాకుండా.. వైకాపా నాయకులు ఎదురు నోటీసులు పంపిస్తున్నారని.. చిత్తూరు జిల్లా మదనపల్లెలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి మీనా కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారికి ఫిర్యాదు చేసిన ఆమె.. తన ప్రమేయం లేకుండానే తొమ్మిదో వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న తనను తొలగించినట్లు ఆరోపించారు.
రాజీకి రావాలని తొలుత వైకాపా నాయకులు కోరారన్న మీనాకుమారి.. ఒప్పుకో నందుకు తనకు లీగల్ నోటీసులు పంపించారంటూ వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన నామినేషన్ స్వీకరించేలా కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. వైకాపా ఎమ్మెల్యే నవాజ్ భాష అండతోనే.. స్థానిక నాయకులు ఈ ఆగడాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ మేరకు డీఎస్పీ రవి మనోహరాచారికి ఫిర్యాదు లేఖను అందజేసినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి..