ETV Bharat / state

నర్సింగ్ మహిళా అభ్యర్థుల ఆందోళన - thirupathi latest news

తిరుపతిలో నర్సింగ్ మహిళా అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, తప్పుడు పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేశారని ఆరోపించారు.

Concern of Nursing Women Candidates in Tirupati
తిరుపతిలో నర్సింగ్ మహిళా అభ్యర్థుల ఆందోళన
author img

By

Published : Sep 1, 2020, 9:46 PM IST

స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ తిరుపతిలో... నర్సింగ్ మహిళా అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. రుయా ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ముఖాముఖి ద్వారా.. తప్పుడు పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేశారని ఆరోపించారు.

రోజుకో కారణాలు చెప్పి కౌన్సెలింగ్ నిలిపివేస్తున్నారని, ఫలితంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ అంశంపై జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా స్పందించాలని... అర్హులకు సత్వరమే తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

30 నైపుణ్యాభివృద్ధి కళాశాలలు ఏర్పాటు చేయాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.