అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ.. వైకాపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎర్రగుంటపల్లిలో జరిగిందీ ఘటన. సీసీ రోడ్డు ప్రారంభోత్సవం నాటి గుర్తులోని.. సీఎం జగన్, మంత్రి నారాయణ స్వామి చిత్రాలను చెరిపేశారు.
ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా.. ఈ శిలాఫలకాలు ఆవిష్కరించి రోడ్డు ప్రారంభించారు. మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకొన్న ఫలకాన్ని.. గుర్తుతెలియని వ్యక్తులు నాశనం చేశారని వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: