ETV Bharat / state

బస్సు నుంచి జారిపడి బీటెక్​ విద్యార్థి మృతి..

ప్రమాదవశాత్తు బస్సు దిగుతూ కాలు జారడంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పుత్తూరులోని ఓ ఇంజనీరింగ్​ కళాశాలలో జరిగింది. శనివారం ఉదయం కళాశాలకు బస్సులో వెళ్లిన అతను.. పార్కింగ్‌ చేసేందుకు చోదకుడు ముందుకు తీస్తున్న సమయంలో లోకేష్‌ బస్సు దిగడానికి ప్రయత్నించి కాలుజారి పడిపోయాడు. భర్త వెంకటముని గత నెల కువైట్‌కు వెళ్లాడని ఇంతలోనే కుమారుడు మృత్యువాత పడడంటంతో లోకేష్​ తల్లి బోరున విలపిస్తోంది.

college student died while getting down from bus
బస్సు నుంచి జారిపడి బీటెక్​ విద్యార్థి మృతి
author img

By

Published : Jan 31, 2021, 11:46 AM IST

ప్రమాదవశాత్తు బస్సు నుంచి కాలు జారడంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన శనివారం పుత్తూరులోని ఓ కళాశాలలో జరిగింది. తిరుపతిలోని లింగేశ్వరనగర్‌కు చెందిన వెంకటముని, జ్యోతి దంపతుల కుమారుడు లోకేష్‌(20) పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌(ఈసీఈ) రెండో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఉదయం కళాశాలకు బస్సులో వెళ్లిన అతను.. బస్సు కళాశాల వద్ద ఆపి ఉంచగా విద్యార్థులు దిగసాగారు. కాసేపటికి బస్సును పార్కింగ్‌ చేసేందుకు చోదకుడు ముందుకు తీస్తున్న సమయంలో లోకేష్‌ బస్సు దిగడానికి ప్రయత్నించి కాలుజారి పడిపోయాడు. ప్రమాదంలో స్పృహ తప్పిన విద్యార్థిని కళాశాల యాజమాన్యం చికిత్స నిమిత్తం తిరుపతి ఆసుపత్రి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ లోకేష్​ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

డ్రైవర్‌ నిర్లక్ష్యంతో కుమారుడు మృతి..

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే కుమారుడు లోకేష్‌ మృతి చెందాడని, యాజమాన్యం బాధ్యతవహించి న్యాయం చేయాలని మృతుని తల్లి జ్యోతి కన్నీటి పర్యంతమైంది. భర్త వెంకటముని గత నెల కువైట్‌కు వెళ్లాడని ఇంతలోనే కుమారుడు మృత్యువాత పడడం ఆమె జీర్ణించుకోలేక బోరున విలపించింది.

ఇదీ చదవండి: మదనపల్లె జంట హత్యల కేసు: వెలుగులోకి రాని మరో కోణం ఏంటి..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.