చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివిటి రేటు పెరుగుతోందని.. జాగ్రత్తలు తీసుకోకపోతే మరణాలు పెరిగే అవకాశముందని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో పరీక్షల సంఖ్య భారీగా పెంచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారిని అధికారులు నిత్యం మానిటరింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు.
ఇదీ చదవండి: తిరుపతిలోని కొవిడ్ కేర్ సెంటర్కు సినీనటి సమంత సాయం