తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలకు రానున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తిరుమలకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్నారు. గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్డు మార్గంలో వెళ్లి అక్కడినుంచి 2.50 గంటలకు విమానంలో తిరుపతి బయలుదేరతారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి వీఐపీ లాంజ్ చేరుకుంటారు.సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. ఇరువురూ కలసి సాయంత్రం 4.40 గంటలకు తిరుమల బయలుదేరతారు. శ్రీవారి దర్శనానంతరం రాత్రి 7 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రాత్రి 8.15 గంటలకు ప్రధానికి వీడ్కోలు పలికిన అనంతరం రాత్రి 8.30 గంటలకు విమానంలో విజయవాడకు బయలుదేరతారు. రాత్రి 9.45 గంటలకు తాడేపల్లి లోని నివాసానికి చేరుకుంటారు.
ఇది కూడా చదవండి.