సీఎం జగన్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. భారత్ -పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగి 50 ఏళ్లు గడిచిన నేపథ్యంలో 'స్వర్ణిమ్ విజయ్ దివస్ ' పేరిట నిర్వహిస్తున్న విజయోత్సవాలలో పాల్గొననున్నారు. 1971 యుద్ధంలో పాల్గొని అమరులైన వారి కుటుంబ సభ్యులను సన్మానించనున్నారు. సీఎం జగన్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కార్యక్రమానికి చేరుకుంటారు. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న 'స్వర్ణిమ్ విజయ్ దివస్ ' ఏర్పాట్లను అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు పరిశీలించారు.
ఇదీ చదవండి