ETV Bharat / state

అపహరణకు గురైన సామకోటవారిపల్లి సర్పంచి అభ్యర్థి క్షేమం! - చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం సామకోటవారిపల్లి వార్తలు

అపహరణకు గురైన చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం సామకోటవారిపల్లి సర్పంచి అభ్యర్థి ఓబుల్‌రెడ్డి క్షేమంగా ఉన్నారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను రాత్రి సమయంలో వచ్చి స్థానిక బస్టాండ్​లో వదిలేసి వెళ్లారు.

chittor district sakotavaripalle missed sarpanch candidate obul reddy is safe
అపహరణకు గురైన సామకోటవారిపల్లి సర్పంచి అభ్యర్థి క్షేమం
author img

By

Published : Feb 5, 2021, 8:26 AM IST

Updated : Feb 5, 2021, 9:28 AM IST

నిమ్మనపల్లె మండలం సామకోటవారిపల్లె సర్పంచి అభ్యర్థి ఓబుల్‌రెడ్డిని గురువారం వేకువజామున అపహరించి.. ఆపై రాత్రి పది గంటల సమయంలో వాహనంలో తీసుకువచ్చి గ్రామ సమీపంలో బస్టాపు వద్ద వాహనం నుంచి దించి వెళ్లారు. సమీపంలోని ఓ ఇంటికి వెళ్లి తన కష్టాన్ని వివరించడంతో పాటు బంధువులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్థులు చేరుకుని అపహరణ విషయం తెలుసుకున్నారు. తెదేపా నేతలు ఇక్కడికి చేరుకుని బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో తన అపహరణ విషయాన్ని బయటపెట్టారు.

ఓబుల్‌రెడ్డి సర్పంచి పదవికి నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడంలో భాగంగా కిడ్నాప్‌నకు పాల్పడ్డారు. సామకోటవారిపల్లె సర్పంచి పదవికి తెదేపా మద్దతుతో ఓబులురెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. గురువారం ఉదయం నామినేషన్‌ వేయడానికి బుధవారం రాత్రి వరకు ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు ఇంటింటి ప్రచారం చేపట్టారు. గురువారం తెల్లవారు జామున 3.30 గంటలకు పోలీసుల పేరిట ఇంటి తలుపు తట్టగా ద్వారం తెరిచారు. అనంతరం నలుగురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని ముసుగు ధరించి తీసుకెళ్లారు. పగలంతా కారులో తిప్పారు. కనీసం మంచి నీరు కూడా ఇవ్వలేదు. అపహరించిన వ్యక్తులు గుర్తుపట్టని విధంగా వ్యవహరించారని వివరించారు.

నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత

నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత గురువారం రాత్రి సమయానికి ఓబుల్‌రెడ్డిని వదిలిపెట్టారు. అపహరణ విషయం తెలుసుకుని ఇతని నివాసాన్ని తెదేపా మదనపల్లె ఇన్‌ఛార్జి దొమ్మలపాటి రమేష్‌, ఎన్నికల ప్రత్యేక విధులు నిర్వహిస్తున్న అదనపు ఎస్పీ నిశాంత్‌రెడ్డి, డీఎస్పీ మూర్తి సందర్శించారు. స్థానిక తెదేపా నేతలు శ్రీనివాసులు, మునిరత్నం, మల్లికార్జున్‌ తదితరులు సందర్శించడంతో పాటు బంధువుల ద్వారా ఆరా తీశారు. ఘటనపై ఓబుల్‌రెడ్డి బామ్మర్ది మల్లికార్జునరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పల్నాడులో పేట్రేగిన నాయకులు.. నామినేషన్‌ వేయకుండా అడ్డగింపులు

Last Updated : Feb 5, 2021, 9:28 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.