తిరుపతి స్విమ్స్‌లో కేవలం చిత్తూరు జిల్లానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల కొవిడ్ 19 పరీక్ష ఫలితాలను నిర్ధరిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా తెలిపారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశాన్ని ఏర్పాటుచేసిన ఆయన... కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడిన కలెక్టర్... 2 రాష్ట్రాల నుంచి వచ్చే నమూనాలను తిరుపతి స్విమ్స్‌లో పరిశీలిస్తుండటం వల్ల సిబ్బంది కొరత ఎదురవుతుందన్నారు. ఆ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను డిస్ఇన్ఫెక్షన్ చేస్తున్నామని తెలిపారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి ఐసోలేషన్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: