చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ నేరాలపై పోలీసులు దృష్టి పెట్టారు. కేసుల శోధనలో భాగంగా గుడిపాల, యాదమరి ఎస్సైలు వాహనాలను తనిఖీస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులో తీసుకొని విచారించారు. వీరు చైన్ స్నాచింగ్ ముఠాకు చెందిన వారని పోలీసులు గుర్తించారు.
ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారిని వెనక నుండి వెంబడించి.. మహిళల మెడలో నుంచి నగలను లాక్కొని పారిపోయేవారని పోలీసులు తెలిపారు. వీరు గతంలో ఏడు కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నారని చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. నిందితులు తజముల్ పాషా, మహమూద్ సయీద్ లను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: పుత్తూరులో పార్క్‌కు ఎమ్మెల్యే రోజా శంకుస్థాపన