తన భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ మహిళపై.. చిత్తూరుకు చెందిన న్యాయవాది కవిత దాడికి దిగారు. తిరుపతి నగరంలోని పద్మావతి నగర్‌లో.. మహిళ ఇంటి ముందు బైఠాయించారు. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. భర్తను అనుసరించి ఆ మహిళ ఇంటికి వెళ్లగా.. తనను చూసి ఆయన పారిపోయాడని తెలిపారు. అక్కడ దొరికిన భర్త సెల్‌ఫోన్, ఇతర వస్తువులను పోలీసులకు అందజేశారు.
తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం పోలీస్‌స్టేషన్‌లో.. తన భర్త చంద్రమౌళిపై ఫిర్యాదు చేసినట్లు కవిత తెలిపారు. మానసికంగా వేధించడంతో పాటు కారు డ్రైవర్ భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని అందులో పేర్కొన్నట్లు వివరించారు. చిత్తూరులో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు ఉపసంహరించుకోకపోతే చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఇదీ చదవండి: తిరుపతిలో అనుమానాస్పద వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు