చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని బందార్ల పల్లె గ్రామానికి చెందిన త్యాగరాజుల నాయుడి కుమార్తె ప్రేమలత అమెరికాలో మృతి చెందింది. విషయం తెలిసినప్పటి నుంచి కుటుంబసభ్యులు అమ్మాయిని కడసారి చూసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. కరోనా సమయం కావటంతో అమెరికాలోనే దహన సంస్కారాలు జరుగుతాయని సమాచారం అందింది. దీంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు అల్లుడి స్వగ్రామమైన చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లెకు వెళ్లారు.
తమ బిడ్డ మృతదేహాన్ని తీసుకువచ్చే వరకు అల్లుడి ఇంటి వద్ద నుంచి వెళ్లేది లేదని ప్రేమలత కుటుంబసభ్యులు వీధిలోనే కూర్చుండిపోయారు. పోలీసులు వచ్చి..వారితో మాట్లాడి మరణించిన తమ కుమారైను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దీంతో నాలుగు రోజుల ఎదురుచూపులకు ఫలితం దక్కినట్లైంది.
ఇదీ చదవండి: చెట్టును ఢీకొన్న కారు.. ఆరుగురికి గాయాలు