ETV Bharat / state

24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ముగ్గురు స్మగ్లర్ల అరెస్ట్ - Red sandalwood smuggler arrested

ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి రూరల్ మండలం కరకంబాడీ రోడ్డు సమీపంలోని అడవుల నుంచి అక్రమ రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. దీని వెనుక ఉన్న ఇతర స్మగ్లర్ల గురించి ఆరా తీస్తున్నామని, వారి కోసం గాలిస్తున్నామని అన్నారు.

Chittoor district police have arrested three red sandalwood smugglers
24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ముగ్గురు స్మగ్లర్ అరెస్ట్
author img

By

Published : Feb 13, 2021, 9:37 AM IST

తిరుపతి రూరల్ మండలం కరకంబాడీ రోడ్డు సమీపంలోని అడవుల నుంచి ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి 24 ఎర్రచందనం దుంగలను, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కేసీ వెంకటయ్య తెలిపారు.

ఎర్రచందనం అక్రమ రవాణాపై అందిన సమాచారంతో కరకంబాడీ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించినట్లు డీఎస్పీ వెల్లడించారు. డీ మార్ట్ వెనుక వైపున ఎర్రచందనం దుంగలు వాహనంలోకి లోడ్ చేసి రవాణాకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం కనిపించకుండా, సెంట్రింగ్​కు ఉపయోగించే పరికరాలతో కప్పి పెట్టడంతో.. టాస్క్ ఫోర్స్ టీమ్ తనిఖీలు చేపట్టి చెన్నై రెడ్ హిల్స్ కు చెందిన సూర్య (23), ప్రదీప్ (20), తిరుపతి మంగళంకు చెందిన కిరణ్ (29) లను అదుపులోకి తీసుకున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. దీని వెనుక ఉన్న ఇతర స్మగ్లర్ల గురించి ఆరా తీస్తున్నామని, వారి కోసం గాలిస్తున్నామని అన్నారు. ఈ ఆపరేషన్​లో సీఐ వెంకట రవి, డీఆర్వో నరసింహరావు, హెచ్​సీ వెంకటేష్, జానీ బాషా, కోదండం పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'వ్యాక్సిన్​ తీసుకున్నా.. మాస్కు తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.