ETV Bharat / state

'వ్యాధి ఏదైనా... తప్పకుండా తెలియజేయాలి' - వ్యాధుల నమోదు కోసం చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా వైద్యులతో సమావేశం

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో... డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలపై జిల్లా వైద్యాధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యంతో కలెక్టర్ సమీక్షించారు. ఆసుపత్రికి వచ్చే కేసుల్లో వ్యాధి ఏదైనా తమకు తెలియచేయాలని ఆదేశించారు.

chittoor collector conducting a meeting with private hospital doctors
తిరుపతిలో ప్రైవేటు వైద్యులతో కలెక్టర్ భరత్ గుప్తా సమావేశం
author img

By

Published : Dec 6, 2019, 8:19 PM IST

తిరుపతిలో ప్రైవేటు వైద్యులతో కలెక్టర్ భరత్ గుప్తా సమావేశం

చిత్తూరు జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదయ్యే కేసుల్లో... వ్యాధి ఏదైనా తప్పకుండా తెలియజేయాలని జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా ఆదేశించారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై ఆయన సమీక్షించారు. జిల్లా వైద్యాధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం సమీక్షలో పాల్గొన్నారు. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం సిటిజెన్ చాట్ కొనసాగించటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైద్యాధికారులు పర్యవేక్షణ లోపమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదయ్యే ఏ వ్యాధి అయినా సరే తప్పకుండా జిల్లా కలెక్టరేట్​కు మెయిల్ ద్వారా పంపాలని ఆదేశించారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండీ:

భాజపాలో చేరిన తితిదే పాలకమండలి మాజీసభ్యుడు

:

Intro:వ్యాధి ఏదైనా... తప్పకుండా తెలియజేయాలి

Body:చిత్తూరు జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదయ్యే కేసులలో వ్యాధి ఏదైనా తప్పకుండా తెలియజేయాలని జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా ఆదేశించారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై జిల్లా వైద్య అధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యంతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం సిటిజెన్ చాట్ మెయింటైన్ చేయడం లేదని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి జిల్లా వైద్యాధికారులు పర్యవేక్షణ లోపమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదయ్యే ఏ వ్యాధి అయినా సరే తప్పకుండా జిల్లా కలెక్టరేట్ కు జిమెయిల్ ద్వారా పంపాలని ఆదేశించారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.