యువతలోని నైపుణ్యాలకు ప్రోత్సహించేలా.. ప్రేరణ యువజనోత్సవాలు నిలుస్తాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అన్నారు. తిరుపతిలోని ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ప్రేరణ యువజనోత్సవాలను ఆయన ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులతో కలిసి ప్రారంభించారు.
విభిన్న అంశాల్లో యువతలోని అంతర్లీనంగా ఉన్న సృజనను వెలికి తీసేలా ఈ తరహా కార్యక్రమాలు ఉపయోగపడతాయని కలెక్టర్ అన్నారు. అనంతరం తన సర్వీసులోని అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.
ఇదీ చదవండి: