ETV Bharat / state

సచివాలయంలో చికెన్​ బిర్యానీతో విందు - secretariat

చికెన్ బిర్యానీ
author img

By

Published : Oct 2, 2019, 3:02 PM IST

Updated : Oct 2, 2019, 4:07 PM IST

14:59 October 02

undefined
సచివాలయంలో చికెన్​ బిర్యానీతో విందు

మహాత్మాగాంధీ 150వ జయంతి రోజే చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో మాంసాహార భోజనం పెట్టటం వివాదాస్పదమవుతోంది. జిల్లాలోని సత్యవేడు మండలం చినపాండూరు, మత్తేరి మిట్ట గ్రామాల్లో ఈరోజు గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే గాంధీ జయంతి రోజు మాంసాహారంపై నిషేధం ఉన్నా వచ్చిన వారికి చికెన్ బిర్యానీతో భోజనాలు పెట్టటం విమర్శలకు తావిస్తోంది. గాంధీ జయంతి రోజు మాంసాహార విక్రయాలు జరగకూడదని సర్కార్ నిషేధాజ్ఞలు పెట్టినా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలా జరగటాన్ని పలువురు తప్పుపడుతున్నారు. మత్తెరి మిట్టలో జరిగిన గ్రామ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సత్యవేడు శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం వచ్చి వెళ్లిన కాసేపటికే మాంసాహార భోజనాలు పెట్టినా అధికారులు పట్టించుకోకపోవటం చర్చనీయాంశమైంది.

Intro:ap_knl_72_02_no_plastic_ryally_av_ap10053

ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కల్పించడానికి కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సిబ్బంది ఆధ్వర్యంలో వినూతనంగా ర్యాలీ జరిగింది.పట్టణంలోని పురపాలక కార్యాలయం నుండి బీమాస్ కూడలి ప్లాస్టిక్ రహిత ర్యాలీ కొనసాగింది...ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి....అందరూ జూట్ ఉత్పత్తులతో తయారు చేసిన సంచులను వాడాలని,50 మైక్రోన్ల కంటే తక్కువుగా ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించరదని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పురపాలక ఉద్యోగులు,కార్మికులు పాల్గొన్నారు.

Body:.

Conclusion:.
Last Updated : Oct 2, 2019, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.