చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటరామాపురంలో చెవిరెడ్డిని గ్రామానికి రావద్దంటూ గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ నెల 19న రీపోలింగ్ నెేపథ్యంలో ఎన్.ఆర్.కమ్మపల్లిలోని ఎస్సీ కాలనీలో చెవిరెడ్డి ప్రచారం చేయటానికి బయటి ప్రాంతాల నుంచి జనాలను తీసుకొస్తున్నారని గ్రామస్థులు ఆందోళన చేశారు. దీంతో ఆయన ప్రచారం నిలిపివేసి వెనుదిరిగారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఘటన స్థలానికి పోలీసుల చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
ఇవీ చదవండి