ప్రతి ప్రైవేటు ఆసుపత్రి కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా రూపుదిద్దుకోవాలని తుడా ఛైర్మన్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతి ఎస్వీయూవీసీ బంగ్లాలో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, జేసీ వీరబ్రహ్మం తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు.
నగర పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో.. ఆసుపత్రుల్లో పడకల పెంపు, బాధితులకు నాణ్యమైన ఆహారం, మందులు అందించే అంశంపై చర్చించారు. కొవిడ్ బాధితులకు ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్యసేవలు అందించడానికి నిర్ణయించారు. విస్తృత స్థాయిలో కరోనా పరీక్షలు జరగాలని, ఫలితాలు వీలైనంత త్వరగా వెల్లడించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో బాధితులను క్వారంటైన్ సెంటర్లకు తరలించే విధంగా అంబులెన్సుల ఏర్పాటుకు కలెక్టర్ ఆమోదం తెలిపారు.
ఇవీ చదవండి...