వైకాపా శ్రేణుల దాడిలో గాయపడిన నేతలను తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్ ద్వారా పరామర్శించి.. ధైర్యం చెప్పారు. ఎవ్వరూ అధైర్యపడకుండా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. గాయపడిన తెదేపా నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పోలీసుల చర్యను ఖండించారు. దాడిచేసిన వారిని కాకుండా గాయపడిన వారిని అరెస్ట్ చేయడం హేయమైన చర్యని మండిపడ్డారు. అసలు నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా దాడులకు భయపడేది లేదన్న చంద్రబాబు... దౌర్జన్యాలతో తెదేపాని భయపెట్టలేరని స్పష్టం చేశారు. వైకాపా దౌర్జన్యాలకు ప్రజలే బుద్ధిచెబుతారని హెచ్చరించారు.
ఇదీ చదవండీ... వైకాపా దాడులు, దౌర్జన్యాలకు వడ్డీతో సహా చెల్లిస్తాం: చంద్రబాబు