ETV Bharat / state

'సంస్కృతాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి' - ramesh pokriyal

కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్.. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠాన్ని సందర్శించారు. విద్యాపీఠం విద్యార్థులతో కలిసి శోభయాత్రలో  నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. విద్యాపీఠం నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతి ఎంపీతో కలిసి పాల్గొన్నారు.

సంస్కృత భాషను భవిష్యత్ తరాలకు అందించాలి : కేంద్రమంత్రి పోఖ్రియాల్
author img

By

Published : Aug 14, 2019, 4:47 PM IST

Updated : Aug 14, 2019, 6:37 PM IST

దేశ సంస్కృతికి మూలమైన సంస్కృత భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్నారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠాన్ని సందర్శించిన ఆయన... పలు అభివృద్ధికి కార్యక్రమాలకు శంకుస్థాపన, నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి విద్యాపీఠం ప్రాంగణంలో శోభాయాత్రను నిర్వహించారు. అంతకుముందు వేద విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రికి వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సంస్కృత విద్యాపీఠంలో నిర్వహించిన కార్యక్రమంలో పోఖ్రియాల్ స్వయంగా రచించిన హిందీ పద్యమాలిక 'కోయి ముష్కిల్ నహీ'కి సంస్కృత అనువాద పుస్తకాన్ని ఆవిష్కరించారు.

సంస్కృతాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి : కేంద్రమంత్రి పోఖ్రియాల్

తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్, కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కార్యక్రమం మొత్తం సంస్కృతంలోనే నిర్వహించడాన్ని వ్యంగ్యంగా తప్పుపట్టిన ఎంపీ... తెలుగు సంప్రదాయాలకు, భాషకు సైతం చోటు కల్పించాలని కోరారు. స్థానికులకు విద్యాపీఠంలో ప్రవేశాలు కల్పించాలని కోరిన ఎంపీ.. సంస్కృత విద్యాపీఠానికి కేంద్రీయ విశ్వవిద్యాలయం హోదా కల్పించాలన్నారు.

సరైన సమయంలో నిర్ణయం : కేంద్ర మంత్రి
దేశంలోని భాషలన్నింటికీ మూలమైన సంస్కృతాన్ని కాపాడుకోవాలన్నారు కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్. అందులో భాగంగా సంస్కృత విద్యాపీఠాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం హోదాపై సరైన నిర్ణయం తీసుకుంటామ పేర్కొన్నారు. గడచిన ఐదేళ్లలో పలు జాతీయ సంస్థలను ఏపీలో ఏర్పాటు చేయటం ద్వారా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడిందని తెలిపారు.

ఇదీ చదవండి :

వైరల్​: లంచం కోసం లాఠీలతో ఖాకీల ఫైట్!

Intro:కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం లోని కుంటముక్కల గ్రామంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత బాలయోగి గురుకుల పాఠశాల ప్రాంగణాన్ని డి ఎస్ పి శ్రీనివాసులు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల గురించి తెలుసుకుంటున్న నేపద్యంలో కుంటముక్కల గురుకుల పాఠశాలలో కొన్ని తరగతుల గదులకు ఫ్యాన్లు బాలికల గదులకు దోమలు రాకుండా మెస్ అవసరమని బాలికల ద్వారా తెలుసుకున్నామని పై విషయంలో స్పందించి బాలికలకు అవసరమైన ఫ్యాన్లు లు దోమల మెస్ లు అందించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వెల్వడం గ్రామ వైసిపి పార్టీ అధ్యక్షుడు ఎర్రమల రాంభూపాల్ రెడ్డి నేడు బాలికలకు అవసరమైన వస్తువులను అందించడం ఆనందంగా ఉందని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు ఇలాంటి మంచి పని కి ముందుకు వచ్చిన దాత ని అభినందించారు

Body:గురుకుల బాలికల వసతి గృహము సందర్శించిన డిఎస్పీ శ్రీనివాసులు

Conclusion:బాలయోగి గురుకుల పాఠశాలను సందర్శించిన పోలీస్ అధికారులు
Last Updated : Aug 14, 2019, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.