రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా రవాణా చేస్తూ..పట్టుబడిన ఎర్ర చందనం దుంగలను వేలం వేయటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరినట్లు అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. దాదాపు 5 వేల టన్నుల వరకు ఎర్రచందనం ఉన్నట్లు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా..స్పందించిందని త్వరలో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పశ్చిమ అటవీ ప్రాంతం నుంచి పొలాల పైకి వచ్చే ఏనుగుల గుంపును నివారించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య గత తెదేపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా తలెత్తినట్లు పేర్కొన్నారు. దీన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీచదవండి