స్వచ్ఛసర్వేక్షణ్ -2020 ర్యాకింగ్స్ లో చిన్న, మధ్యతరహా నగరాల జాబితాలో తిరుపతి జాతీయ స్థాయిలో ఆరో ర్యాంక్‌లో నిలిచిందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా తెలిపారు. లక్ష నుంచి 10లక్షల జనాభా నగరాల జాబితాలో తిరుపతి ఈ ర్యాంక్ ను కైవసం చేసుకుందన్నారు. ఈ కేటగిరీలో రాష్ట్రంలోనే తిరుపతిది ప్రథమ స్థానమన్న కమిషనర్....సుస్థిరాభివృద్ధి నగరాల జాబితాలో దేశంలోనే ప్రథమస్థానం కైవసం చేసుకోవటం సంతోషంగా ఉందన్నారు.
పారిశుద్ధ్య కార్మికులు, నగరపాలక సంస్థ అధికారుల సమిష్ఠి కృషితోనే ఈ ర్యాంక్ సాధ్యమైందని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రశంసించారు. నగరపాలిక కార్యాలయంలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, నగరపాలిక కమిషనర్ పి.ఎస్.గిరీషా సమక్షంలో అధికారులు, ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు.
ఇవీ చదవండి: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి 'స్వచ్ఛ కిరీటాలు'