BULL FEST: సంక్రాంతి పండుగ రెండ్రోజులు ఒకెత్తైతే... మూడో రోజు వచ్చే కనుమ మరో ఎత్తు. పల్లె ప్రజల జీవితాల్లో అంతర్భాగమైన పశువులకు ఈ రోజున ప్రత్యేక అలంకరణలు చేసి, పూజలు నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకంగా పశువుల పండుగ చేస్తారు. వాటిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత వాటి కొమ్ములకు బహుమతులు కడతారు. అనంతరం జనసమూహంలోకి వదులుతారు. వేగంగా దూసుకొచ్చే పశువులను లొంగదీసి వాటికి కట్టిన బహుమతులను సొంతం చేసుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. ఇక్కడి ప్రజలు ఏళ్లుగా దీనిని సంప్రదాయంగా జరుపుకుంటున్నారు. తమ జీవితంలో భాగమైన పశువులును పూజించడంతో పాటు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. పండుగను నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
పశువుల పండుగను తమిళనాడు జల్లికట్టుతో పోల్చడం సరికాదంటున్న గ్రామస్థులు.. దానితో ఏమాత్రం సంబంధం లేదని చెబుతున్నారు. అనాదిగా కొనసాగుతున్న ఆచారమని అంటున్నారు. ఏ మాత్రం హింసకు తావులేకుండా పశువులను పూజించి వాటిని అందంగా అలంకరించి.. కేవలం అదుపు చేయటమే తమ ఉద్దేశమని వివరిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పండుగను చూడటానికి తరలివచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చదవండి: