ఓ వ్యక్తి రైసుమిల్లు గోడల పగుళ్ల మధ్య ఇరుక్కుని మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో చోటు చేసుకుంది. బండారుపల్లి అరుంధతీవాడకు చెందిన బిరజాల దేశయ్య శ్రీకాళహస్తి శివారు ప్రాంతాల్లో చేపలు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఆదివారం పానగల్ పరిసర ప్రాంతాల్లో చేపలు విక్రయించాడు. సమీపంలోని రైసుమిల్లులోకి వెళ్లేందుకు ఎందుకు ప్రయత్నించాడో ఏమో భారీ పగుళ్లు ఉన్న గోడల మధ్య మృతి చెంది ఉండటాన్ని సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం రాత్రి రైసుమిల్లులోకి వెళ్లే ప్రయత్నంలో దేశయ్య జేబులోని గుట్కా ప్యాకెట్ నేలపై పడిపోయి ఉంటుందని.. దాన్ని తీసుకునే క్రమంలో గోడల సందులో ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ఏర్పేడు మండలంలో గోడల మధ్య ఆగిన ఊపిరి
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో ఓ వ్యక్తి రైసుమిల్లు గోడల పగుళ్ల మధ్య ఇరుక్కుని మృతి చెందాడు. బండారుపల్లి అరుంధతీవాడకు చెందిన బిరజాల దేశయ్య శ్రీకాళహస్తి శివారు ప్రాంతాల్లో చేపలు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు.
ఓ వ్యక్తి రైసుమిల్లు గోడల పగుళ్ల మధ్య ఇరుక్కుని మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో చోటు చేసుకుంది. బండారుపల్లి అరుంధతీవాడకు చెందిన బిరజాల దేశయ్య శ్రీకాళహస్తి శివారు ప్రాంతాల్లో చేపలు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఆదివారం పానగల్ పరిసర ప్రాంతాల్లో చేపలు విక్రయించాడు. సమీపంలోని రైసుమిల్లులోకి వెళ్లేందుకు ఎందుకు ప్రయత్నించాడో ఏమో భారీ పగుళ్లు ఉన్న గోడల మధ్య మృతి చెంది ఉండటాన్ని సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం రాత్రి రైసుమిల్లులోకి వెళ్లే ప్రయత్నంలో దేశయ్య జేబులోని గుట్కా ప్యాకెట్ నేలపై పడిపోయి ఉంటుందని.. దాన్ని తీసుకునే క్రమంలో గోడల సందులో ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:
జావలా అన్నం.. నీళ్లలా సాంబారు