తమ బిడ్డ ప్రాణాలను కాపాడండి అని దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు ఆ తల్లిందండ్రులు. కళ్లేదుటే బిడ్డ జీవచ్ఛవంలా తయారవుతున్న తీరును చూసి కనిపించని బాధను దిగమింగుతున్నారు చిత్తూరు జిల్లాకు చెందిన రమేశ్, రాధ దంపతులు. పేగు సమస్యతో బాధపడుతున్న బిడ్డను చూసి కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇప్పటివరకు లక్షల రూపాయలు ఖర్చు చేసి.. నాలుగు ఆపరేషన్లు చేసినా ఫలితం మాత్రం...శూన్యం. చేతిలో ఉన్న డబ్బు అయిపోవడంతో దాతల సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఆ తల్లిదండ్రులు.
వికటించడంతో సమస్య
రమేశ్, రాధ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో రెండో వాడైన యుగంధర్ 2005లో పుట్టాడు. 20 రోజుల పురిటిబిడ్డగా ఉన్నప్పుడే బొడ్డు వద్ద పేగుకు సంబంధించిన ఆపరేషన్ చేశారు. పేగు సమస్యతో బాధపడుతున్న యుగేంధర్...ఎలాంటి ఆహారం తిన్నా... తాగినా కడుపులో నుంచి బయటికి వచ్చిన పేగు ద్వారా బయటకు వచ్చేస్తుంది. రోజూ నాలుగు సెలైన్ల బాటిళ్లే ఆ బిడ్డకు ఆహారం. బిడ్డ ఆకలి అంటే చాలు ఆస్పత్రికి వైపు పరిగెత్తాల్సిందే. ఇలాంటి పరిస్థితులను జయించేందుకు తల్లిదండ్రులు అప్పులు చేస్తూనే ఉన్నారు. ఇలా అప్పటి నుంచి 15 సంవత్సరాలుగా ఇబ్బందులుపడుతూ బిడ్డను కాపాడుకుంటూ వచ్చారు.
ఆటో నడుపుతూ జీవనం సాగించే రమేశ్... కొడుకు ఆరోగ్యం కోసం ఉన్నదంతా దారపోశాడు. అయినా ఫలితం లేకపోయింది. చేసిన అప్పులను తీర్చలేక...కొత్త అప్పులను తీసుకోలేక...అపహన్నహస్తాల కోసం ఎదురుచూస్తున్నాడు. తమ బిడ్డను కాపాడాలంటూ దాతలను వేడుకుంటున్నాడు.
ఇదీ చదవండి: