చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మల్లంపల్లి గ్రామంలో నాటుకోళ్ల మృతి కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో సుమారుగా 250 నాటుకోళ్లు మృత్యవాత పడ్డాయి. గ్రామంలోని కోళ్లు ఎక్కడిక్కడ మృతి చెందటంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.
సంక్రాంతి పండగ సమీపిస్తుండటంతో గ్రామస్తులు బయట ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన కోళ్లు మృతి చెందటంతో భయాందోళనకు గురవుతున్నారు. మృతి చెందిన కోళ్లను దూరంగా పూడ్చడం, పారేయడం చేస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన కోళ్లను కుక్కలు కూడా తినడం లేదన్నారు. గ్రామంలో కొందరు నాటు కోళ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే వారు కోళ్లన్నీ మృతి చెందటంతో నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: