చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. స్టేషన్లో ఉన్న ప్రయాణికులపై ఇద్దరు నిందితులు బ్లేడుతో దాడికి ప్రయత్నించారు. నిందితులను అడ్డుకునే ప్రయత్నం చేసిన రైల్వే టీసీ ఉమమహేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. నిందితులను అరెస్టు చేసి టీసీ ఉమామహేశ్వర రావును ఆసుపత్రికి తరలించారు.
నిందితులు తమిళనాడుకు చెందిన విజయన్, వెంకటేశ్గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.