ETV Bharat / state

'జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను పూర్తిగా నిరాశలో ముంచేసింది' - చిత్తూరు జిల్లా తాజా వార్తలు

ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను పూర్తిగా నిరాశలో ముంచేసిందని భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు అన్నారు. గ్రూప్ 1,2 సర్వీసుల్లోనే మూడు వేలకుపైగా ఖాళీలు ఉంటే 36 ఉద్యోగాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు.

భాజపా రాష్ట్ర కార్యదర్శి రమేశ్ నాయుడు
భాజపా రాష్ట్ర కార్యదర్శి రమేశ్ నాయుడు
author img

By

Published : Jun 19, 2021, 7:48 PM IST

గ్రూపు సర్వీసులకు సంబంధించి 36్ ఉద్యోగాలతో నోటిఫికేషన్​ను ఇస్తూ.. భారీగా ఉద్యోగాలిస్తున్నట్లు సీఎం జగన్ చేసుకుంటున్న ప్రచారం హాస్యాస్పదమని భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్​లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన..ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను పూర్తిగా నిరాశలో ముంచేసిందన్నారు.

గ్రూప్ 1, 2 సర్వీసుల్లోనే మూడు వేలకుపైగా ఖాళీలు ఉంటే 36 ఉద్యోగాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించిన రమేష్ నాయుడు..ఇప్పటికే పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. పార్టీ సానుభూతిపరులనే వాలంటీర్లుగా పెట్టుకుని..ఉద్యోగాలు ఇచ్చినట్లు వైకాపా ప్రభుత్వం చెప్పుకుంటోందని విమర్శించిన రమేష్ నాయుడు..ఓటు బ్యాంకు కోసం కడప జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠించాలనుకుంటున్న టిప్పు సుల్తాన్ విగ్రహాష్కరణ ఏర్పాట్లను అడ్డుకుని తీరుతామన్నారు.

ఇదీ చదవండి:

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత.. కానీ ఆ విషయం మరువొద్దట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.