ETV Bharat / state

తిరుపతి ఉప ఎన్నికకు భాజపా- జనసేన ప్రత్యేక మేనిఫెస్టో

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల వేళ భాజపా-జనసేన కూటమి ప్రత్యేకంగా మేనిఫెస్టోను విడుదల చేసింది. తిరుపతి పార్లమెంటరీ పరిధిలోని సమస్యలకు పరిష్కారాలను ప్రస్తావించటంతో పాటు దీర్ఘకాలిక రాష్ట్రస్థాయి ప్రయోజనాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది.

తిరుపతి ఉప ఎన్నికకు భాజపా- జనసేన ప్రత్యేక మేనిఫెస్టో
తిరుపతి ఉప ఎన్నికకు భాజపా- జనసేన ప్రత్యేక మేనిఫెస్టో
author img

By

Published : Apr 12, 2021, 5:16 AM IST

తిరుపతి ఉప ఎన్నికకు భాజపా- జనసేన ప్రత్యేక మేనిఫెస్టో

తిరుపతి ఉపఎన్నికల్లో గెలుపు కోసం భాజపా-జనసేన కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తిరుపతి ఉప ఎన్నిక కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచారు. భాజపా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆధ్యాత్మికం, నైపుణ్యం, ఉపాధి కల్పన, సంపూర్ణ ఆరోగ్యం, విద్య, రహదారులు, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, మత్స్యరంగం ఇలా అన్ని రంగాలను స్పృశించేలా ఈ హామీల పత్రాన్ని తీర్చిదిద్దారు.

దీర్ఘకాలిక ప్రయోజనాలను, ఆశయాలను భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో రూపొందించింది. ప్రభుత్వ ఆధీనం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలను తప్పించేలా ప్రక్షాళన చర్యలను తిరుపతి నుంచే ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ధర్మాచార్యుల పర్యవేక్షణలోకి తీసుకురావటంతో పాటు..... తిరుమల కొండపైన అన్యమత ప్రచారాన్ని నిరోధించేలా చర్యలు చేపడుతామని ప్రకటించింది.

మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్క్‌ ఏర్పాటుకు హామీ

యువత కు ఉపాధి కల్పనే ధ్యేయంగా సరైన నైపుణ్యాలను అందించే విధంగా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు, భారీ పెట్టుబడులతో, ఎగుమతుల కోసం మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్క్‌ను తిరుపతి పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రజారోగ్యం కోసం ప్రతి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో అధునాతన సదుపాయలతో పరీక్షా కేంద్రాలను తీర్చిదిద్దటం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పొందిపరిచింది.
48కోట్ల రూపాయల నిధులతో ఏకలవ్య పాఠశాల: భాజపా

భక్తకన్నప్ప పేరుతో 48కోట్ల రూపాయల నిధులతో ఏకలవ్య పాఠశాలను ఏర్పాటు చేస్తామని భాజపా మేనిఫెస్టోలో పేర్కొంది. పాలఉత్పత్తిదారులకు, గొర్రెల పెంపకందార్లకు బ్యాంకుల నుంచి రుణసదుపాయాన్ని కల్పిస్తామని హామీనిచ్చింది. నెల్లూరు జిల్లాలో పెద్దసంఖ్యలో ఉన్న మత్స్యకార కుటుంబాలకు 2 లక్షల రూపాయల కనీస రుణాన్ని తక్కువ వడ్డీతో అందిస్తామని తెలిపింది.

కూటమి అభ్యర్థి రత్నప్రభను గెలిపిస్తే... విభిన్న రంగాల్లో సుదీర్ఘకాలంగా వెంటాడుతున్న సమస్యలను పరిష్కరిస్తామని...భాజపా హామీ ఇచ్చింది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కమలానికే ఓటేయాలని విజ్ఞప్తి చేసింది..

ఇదీ చదవండి:

వైకాపా ప్రకటనలకు భయపడొద్దు: ఎంపీ రామ్మోహన్​నాయుడు

మాడుగులలో కింగ్ కోబ్రా కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.