కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని వైకాపా కుట్రపూరింతంగా వ్యవహరిస్తూ..రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గిడుగు రుద్రరాజు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు చేస్తే అమరావతి, పోలవరంపై ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని ఆయన వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని పరిస్థితి ఏపీలో నెలకొందని..ముఖ్యమంత్రికి పాలనాపరమైన సామర్థ్యం కొరవడిందని విమర్శించారు. పోలవరం లాంటి జీవనాడి ప్రాజెక్టుకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి
'కరోనా తిరగబెట్టొచ్చు అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేం'