ముఖ్యమంత్రి జగన్.. నగరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో రూ.1.85 కోట్లతో నిర్మించనున్న షాదీ మహల్‌కు భూమి పూజ చేశారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటుకు భూమి సేకరిస్తే కొందరు నాయకులు ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టించారని.. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించారు.
అభివృద్ధి చేస్తుంటే అభినందించాలే కాని ఆరోపణలు చేయడం తగదని రోజా హితవుపలికారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు అధికారులు, ముస్లిం మైనార్టీ నాయకులు, వైకాపా నేతలు, తదితరలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కృష్ణాయపాలెం రైతులపై... అట్రాసిటీ సెక్షన్లు కొట్టివేసిన హైకోర్టు