చిత్తూరు జిల్లాలో ఓ రైతు పండిస్తున్న నిషేధిత గసగసాలు (ఓపియం పాపి సీడ్స్) పంటను ఎస్ఈబీ అధికారులు సీజ్ చేశారు. మదనపల్లి మండలం దేవలంపల్లి దగ్గర 10 సెంట్ల విస్తీర్ణంలో నాగరాజు అనే రైతు ఓపియం పాపి సీడ్స్ను అంతర పంటగా సాగు చేస్తున్నాడు. పోలీసులకు అందిన సమాచారంతో దాడులు నిర్వహించిన ఎస్ఈబీ బోర్డర్ పెట్రోలింగ్ అధికారులు.. పంటను కోయించి స్వాధీనం చేసుకున్నారు. మరో పది రోజుల్లో పంట చేతికి అందనుంది. మార్కెట్లో దీని విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఓపియంను హెరాయిన్ తయారీలో వినియోగిస్తారని తెలిపిన ఎస్ఈబీ అధికారులు.. ఈ పంటను పండించడంపై రాష్ట్రంలో నిషేధాజ్ఞలు ఉన్నాయన్నారు. ఇద్దరు కూలీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ట్రాక్టర్ను జప్తు చేశారు. స్థలం యజమాని నాగరాజు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: