చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలని కోరుతూ అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సును మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి ప్రారంభించి మాట్లాడారు. మానవాళి మనుగడను దెబ్బతీసే ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే కష్టాలను ప్రతి ఒక్కరూ గుర్తించి స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడానికి ముందుకు రావాలని సూచించారు. పురపాలక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ను ఆమె సందర్శించారు.
ఇదీ చదవండి... అనధికార ఎరువుల నిల్వా..59 టన్నులు సీజ్