చిత్తూరు జిల్లా యాదమరి మండల కేంద్రంలో భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో చోరీ జరిగింది. యంత్రాన్ని పగులగొట్టిన దొంగలు నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో ఆధారాలను క్లూస్ టీమ్ సేకరించింది. అర్ధరాత్రి దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: