ETV Bharat / state

అనిశా కార్యాలయంలో అవినీతి.. నిందితురాలి అరెస్టు - తిరుపతి నేర వార్తలు

తిరుపతి అనిశా కార్యాలయంలో జరిగిన అవినీతి ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. శాఖకు సంబంధించిన నగదును ఆమె ఉపసంహరించుకొని అక్రమానికి పాల్పడిందని ఉన్నతాధికారులు తెలిపారు.

Arrest of accused in corruption case in thirupathi anti corruption bureau
అవినీతి కేసులో నిందితురాలి అరెస్టు
author img

By

Published : May 31, 2020, 11:54 AM IST

Updated : May 31, 2020, 12:35 PM IST

తిరుపతి అవినీతి నిరోధక శాఖలో జరిగిన అవినీతి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిని.. డిపార్ట్​మెంట్​కు సంబంధించిన నగదు గోల్​మాల్​కు పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. గడిచిన మూడేళ్లుగా.... ఏసీబీ రహస్య సర్వీసుల రివార్డులకు సంబంధించిన ఖాతాలో రూ.పది లక్షలను దశలవారీగా ఉపసంహరించుకున్నారు. చెక్​లపై నగదుకు సంబంధించిన సంఖ్యలను మార్చుతూ అవినీతికి పాల్పడ్డారు. ఈ అంశంపై ఏసీబీ అధికారులు ఎమ్.ఆర్.పల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలుసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. పోలీసులు విచారణలో ఆమె.. తన నేరాన్ని అంగీకరించిందని అధికారులు తెలిపారు.

ఇదీచదవండి.

జూన్‌ 8 నుంచి శ్రీవారి దర్శనం.. గంటకు 300 మందికి మాత్రమే

Last Updated : May 31, 2020, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.