మూఢ నమ్మకాలతో ఇద్దరు కుమార్తెలను దారుణంగా హత్య చేసిన పురుషోత్తంనాయుడు, పద్మజలను... మదనపల్లె సబ్ జైలు నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితుల మానసిక పరిస్థితి పై బుధవారం మదనపల్లె సబ్ జైలు అధికారులు వైద్య పరీక్షలు చేయించగా... వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రిలోని సైకియాట్రీ విభాగానికి తరలించాలని వైద్యులు సూచించారు.
భద్రత కోసం ఏఆర్ సిబ్బంది కి సబ్ జైలు అధికారులు లేఖ రాయగా .. కాసేపటి క్రితం ఏఆర్ బృందం మదనపల్లె కి చేరుకుంది. న్యాయమూర్తి అనుమతితో నేడు నిందితులు పురుషోత్తం, పద్మజలను తిరుపతి రుయాకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి: