ETV Bharat / state

'లక్షాఐదు వేల టీకాల పంపిణీకి వ్యాక్సిన్​ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి'

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్​ వ్యాక్సినేషన్​ డ్రైవ్​ చేపడుతున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో లక్షాఐదు వేల వ్యాక్సిన్లు ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్​ హరినారాయణన్​ తెలిపారు.

chittoor district collector harinarayanan
చిత్తూరు జిల్లా కలెక్టర్​ హరినారాయణన్
author img

By

Published : Jun 20, 2021, 12:09 AM IST

నేడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్​ డ్రైవ్​లో భాగంగా చిత్తూరు జిల్లాకు లక్షాఐదు వేల టీకా డోసులు అందినట్లు కలెక్టర్​ హరినారాయణన్​ తెలిపారు. జిల్లాకు వచ్చిన వాటిలో లక్ష కొవిషీల్డ్ , ఐదు వేలు కొవాక్సిన్ టీకాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. వాటిని ప్రజలకు అందించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారు, ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల తల్లులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్​ కోరారు. మొదటి, రెండో డోసుల కింద ఉదయం ఏడు గంటల నుంచి టీకాలు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన ఆయా కొవిడ్ వ్యాక్సినేషన్​ సెంటర్ల వద్ద టీకాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఇదీ చదవండి: Vaccine: రాష్ట్రానికి చేరుకున్న 5.16 లక్షల కొవిడ్ టీకా డోసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.