అటవీ జంతువుల పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా రూపొందిన అరణ్య చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని అటవీశాఖ అధికారులు కోరారు. తిరుపతి జయశ్యామ్ థియేటర్లో నిర్వహించిన అరణ్య చిత్రం ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల క్యూరేటర్ హిమశైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మానవ తప్పిదాల కారణంగానే ఏనుగులు ఊళ్లలోకి వస్తున్నాయని హిమ శైలజ చెప్పారు. చిత్రంలో ప్రముఖ నటుడు రానా నటిచండం వల్ల వన్యప్రాణులను కాపాడుకోవాలనే సందేశం ప్రజల్లోకి తొందరగా వెళ్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సందేశాత్మకమైన ఈ చిత్రాన్ని ప్రజలకు చేరువచేసేందుకు ప్రభుత్వం తరఫున ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: