ఒక్క పైసా ఆశించకుండా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా పేద ప్రజలకు సేవలందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై.... ట్రస్టు సేవలను కొనియాడారు. కృష్ణా వరదలు వచ్చినప్పుడు 15 కోట్లు ఖర్చు పెట్టి.. ఒక్క రోజులో లక్ష మందికి ఆర్థిక సాయం అందించిన ఘనత ఎన్టీఆర్ ట్రస్టుదని ప్రశంసించారు. తాను శ్రీకారం చుట్టిన ప్రాణదానం పథకం నిధులు ప్రస్తుతం 300 కోట్ల రూపాయలకు చేరాయన్నారు. భవిష్యత్తులో ఈ పథకం ద్వారా వచ్చే నిధులతో రాయలసీమలోని పేద ప్రజానీకానికి ఉచితంగా వైద్యం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ప్రాణదానం నిధులతో సీమ ప్రజలకు ఉచిత వైద్యం - bhuvaneshwari
తిరుమలలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అన్నదానం పథకానికి వచ్చే నిధుల వడ్డీతోనే రోజూ ఎంతోమంది భక్తులకు సేవలందిస్తున్నారు. అదేవిధంగా నేను శ్రీకారం చుట్టిన ప్రాణదానం పథకానికి ప్రస్తుతం 300 కోట్ల నిధులు సమకూరాయి. ఈ పథకానికి వచ్చే డబ్బులతోనే భవిష్యత్తులో సీమలోని పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తా: చంద్రబాబు
ఒక్క పైసా ఆశించకుండా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా పేద ప్రజలకు సేవలందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై.... ట్రస్టు సేవలను కొనియాడారు. కృష్ణా వరదలు వచ్చినప్పుడు 15 కోట్లు ఖర్చు పెట్టి.. ఒక్క రోజులో లక్ష మందికి ఆర్థిక సాయం అందించిన ఘనత ఎన్టీఆర్ ట్రస్టుదని ప్రశంసించారు. తాను శ్రీకారం చుట్టిన ప్రాణదానం పథకం నిధులు ప్రస్తుతం 300 కోట్ల రూపాయలకు చేరాయన్నారు. భవిష్యత్తులో ఈ పథకం ద్వారా వచ్చే నిధులతో రాయలసీమలోని పేద ప్రజానీకానికి ఉచితంగా వైద్యం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట జాతీయ రహదారిపై ఒక ఆటోను కారు ఢీకొనడంతో నలుగురికి గాయాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
Body:గోపాలపురం గ్రామానికి చెందిన పడాల మంగమ్మ, గాడి కాంతమ్మ, నిమ్మకాయల మహాలక్ష్మిలు పని నిమిత్తం ఆటో పై రావులపాలెం వస్తున్నారు ఈతకోట కోట సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారును బలంగా ఢీ కొంది దీంతో ఒక్కసారిగా ఆటో తిరగబడిపోవడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలతోపాటు డ్రైవర్ సతీష్ కుమార్ రెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి
Conclusion:సమాచారం తెలుసుకున్న ఎస్.ఐ విద్యాసాగర్ అక్కడి చేరుకుని వాని స్థానిక భవాని హాస్పిటల్ కి తరలించారు విషయం తెలుసుకున్న కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ సూచన చేశారు