చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లాలో మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటివరకూ జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 112కి చేరుకుంది. ఈరోజు నమోదైన 16 పాజిటివ్ కేసుల్లో.. సత్యవేడులో 5, నాగలాపురం 5, వి.కోట 3, ములకల చెరువు 2, మదనపల్లెకి చెందిన ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరంతా చెన్నై కోయంబేడు మార్కెట్‌కి వెళ్లి వచ్చినవారికి సంబంధించిన వారిగా అధికారులు ధృవీకరించారు.
తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన సత్యవేడు, నాగలాపురం, వి.కోట, మదనపల్లె ప్రాంతాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.... కోయంబేడు మార్కెట్‌కి వెళ్లి వచ్చిన వారిని అధికారులు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకూ 400మంది రైతులను గుర్తించారు. వారికి సన్నిహితంగా ఉన్న 1670 మందికి పరీక్షలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించి పారిశుద్ధ్యం పనులు నిర్వహిస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఇప్పటివరకూ 74మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 38కి చేరింది.
ఇదీ చూడండి: