చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పెద్దకన్నలి ఎస్టీకాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం ఇంట్లో ప్రతిరోజు కూతకూసి నిద్రలేపే కోడిపుంజు మరో కోడిపుంజుతో తిరుగుతుండటాన్ని యజమాని గమనించాడు. కొద్దిరోజులకే కోడిపుంజు గుడ్డు పెట్టడాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. వరుసగా 11 గుడ్లు పెట్టింది. గుడ్లు పొదిగి 5 పిల్లలను చేసి సంరక్షిస్తోంది. స్థానిక పశువైద్యాధికారి నారాయణను వివరణ కోరగా ఒక్కోసారి జన్యులోపంవల్ల ఇలా జరుగుతుందన్నారు.
ఇదీ చదవండీ.. కడప రవాణా శాఖకు భారీ లక్ష్యం కేటాయింపు